థార్డ్ గేర్’లో సీఎం కారు !
తెలంగాణ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో నారాలు తెగే ఉత్కంఠ తప్పదనే ప్రచారం జరిగింది. ఈ లిస్టులో మొదటి వినబడిన మొదటి నియోజకవర్గం గజ్వేల్. అక్కడ ఈసారి కేసీఆర్ ఓడిపోవడం ఖాయం అంటూ కాంగ్రెస్ సీనియర్లు బల్లగుద్ది మరీ చెప్పారు. కేసీఆర్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 50000 మెజారిటీతో కేసీఆర్ ని ఓడిస్తానని సవాల్ చేశాడు. గజ్వేల్ గెలుపు కాంగ్రెస్ అధిష్టానానికి బహుమతిగా ఇస్తానని కూడా చెప్పాడు. కానీ, ఇప్పుడు ఆయన కేసీఆర్ పై వెనకంజలో ఉన్నారు.
గజ్వేల్ లో కేసీఆర్ ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ లో 6559 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాస్త స్లోగా డ్రైవింగ్ ప్రారభించిన కేసీఆర్.. రౌండ్ రౌండ్ కి స్వీడు పెంచుతున్నాడు. మూడో రౌండ్ లో 6వేలకి పైగా ఆధిక్యంలో ఉన్నారు. మరీ.. నాల్గో రౌండ్ లో నాల్గో గేర్ వేస్తారా.. ? లేదా స్లోగా వెళ్లి విజయం సాధిస్తారా.. ?? అన్నది చూడాలి. లేదంటే.. మిగితా రౌండ్ లో పుంజుకొని వంటేరు.. కేసీఆర్ కి షాక్ ఇస్తారా.. ??? అన్నది వేచి చూడాలి.
గజ్వేల్ మాదిరిగా ఉత్కంఠ తప్పదని భావించిన కొడంగల్ లో రేవంత్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. కూకట్ పల్లిలో సుహాసిని వెనుకంజలో ఉన్నారు. మధిరలో భటీ విక్రమార్క్ వెనకంజలో ఉన్నారు.