కేసీఆర్’కు విశ్రాంతి లేదు

తెలంగాణ ప్రజలు కేసీఆర్’కు విశ్రాంతి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెల్వకపోతే తనకేం నష్టంలేదు. వెళ్లి ఇంట్లో విశ్రాంత్రి తీసుకొంటానని ఓ సందర్భంలో కేసీఆర్ అన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలని కాంగ్రెస్ నేతలు ప్రచార అస్త్రంగా మార్చుకొనేందుకు ప్రయత్నించారు. విశ్రాంతి తీసుకోవాలనుకొంటున్న కేసీఆర్ ని గెలిపించడం దండగ. ఎన్నికల తర్వాత కేసీఆర్ శాశ్వతంగా ఫాం హౌస్ లో విశ్రాంత్రి తీసుకోబోతున్నాడనే ప్రచారం చేశారు. ఐతే, ప్రజలకి మాత్రం కేసీఆర్ కి విశ్రాంతి ఇవ్వడం నచ్చలేదు. అందుకే మరోసారి టీఆర్ఎస్ ని భారీ మెజారిటీతో గెలిపించినట్టు కనబడుతోంది.

ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెరాస 87స్థానాల్లో, ప్రజాకూటమి 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఓటమిపాలయ్యే పరిస్థితి కనబడుతోంది. జానారెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టీ విక్రమార్క్, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి.. తదితరులు వెనకంజలో ఉన్నారు. ఇప్పటికైనా.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకి విశ్రాంతినిచ్చి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం గుర్తిస్తే మంచిదని చెబుతున్నారు.