119 స్థానాల్లోనూ కేసీఆర్ గెలుపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అయింది. టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుపుపొందేలా కనబడుతోంది. ప్రస్తుతం 87స్థానాల్లో తెరాస ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెరాస గెలుపు లాంఛనమే. ఐతే, ఈ గెలుపు వెనక ఉన్నది కేవలం కేసీఆర్ అనే మాట వినబడుతోంది. పక్కా ఎన్నికల వ్యూహాంతో కేసీఆర్ ముందుకెళ్లారు. ముందస్తుకెళ్లిన కేసీఆర్ ప్రతిపక్షాలకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లారు. ఆ దూకుడు ప్రతిఫలమే తాజా విజయం అని చెప్పవచ్చు.
వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఐతే, తెలంగాణ ప్రజలు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే దాన్ని పరిగణలోనికి తీసుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్దియే ప్రాతిపదికగా తీసుకొనే తెరాస అభ్యర్థులని గెలిపించాలని నిర్ణయం తీసుకొన్నట్టు కనబడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 119 నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ అభ్యర్థిగా ప్రజలు భావించారు. అందుకే తెరాసకి పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించారు.