సీఎం’గా కేటీఆర్ తొలి అడుగు పడింది !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారుసుడు ఎవరు ? కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు.. ఇద్దరిలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుంది ?? అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ నే. ఇప్పుడీ ప్రశ్నకి సమాధానం చెప్పేశారు సీఎం కేసీఆర్. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను నియమించారు. ఇది కేటీఆర్ ని సీఎం కుర్చీలో పెట్టేందుకు వేసిన తొలి అడుగు పడిందని చెప్పుకొంటున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్
జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. కేంద్రంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్లాన్ వర్కవుట్ అయితే.. త్వరలోనే కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ వేసినట్టు సమాచారమ్.