లోఫర్ హీరోయిన్ సిగ్గులేని పని !
‘లోఫర్’ భామ దిశా పటానీ ఈ మధ్య తెగ రెచ్చిపోతుంది. ఆమె నుంచి హాట్ హాట్ ఫోటోలు క్యూ కడుతున్నాయి. అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కెమెరా ముందు ఇంతలా రెచ్చిపోతున్నారు అసలు మీకు సిగ్గు వేయడం లేదా.. ? అనే ప్రశ్నస్తే.. అసలు నాకు సిగ్గే లేదు. అసలు సిగ్గు అన్న పదం గురించి తాను ఆలోచించను. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే ఇలాంటి ఫోటో షూట్లు తప్పనిసరి అంటోంది.
ఇక, తెలుగులో ‘లోఫర్’ తర్వాత మరో సినిమాలో నటించలేదు పటానీ. బాలీవుడ్ లో బిజీ అయిపోవాలనే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసమే హాట్ హాట్ ఫోటో షూట్స్ ఇస్తోంది. బయటే అన్నీ చూపిస్తున్న పటానీని తీసుకొని సినిమాలో ఏం చూపించాలని బాలీవుడ్ దర్శక-నిర్మాతలు గుసగుసలాడుకొంటున్నట్టు సమాచారమ్.