మోహన్ బాబు మంటలు ఆరనివ్వడం లేదు
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంటలు రాజేశాడు. హాయిగా సాగిపోతున్న ఆడియో ఫంక్షన్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి హీటు పెంచారు. దర్శకుడు క్రిష్ ప్రతిభని మెచ్చుకొనే క్రమంలో.. ‘సినిమాలో మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదన్నారు. అక్కడితో ఆగకుండా.. ‘సినిమాలో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ బాంబు పేల్చాడు.
నందమూరి, నారి కుటుంబ సభ్యుల్లోని కొందరికి మోహన్ బాబు వ్యాఖ్యలు గట్టిగా తగిలాయి. ఐతే, బయటపడలేని పరిస్థితి. దీంతో లొలోపలే కుమిలిపోతున్నారు. ఇప్పడిప్పుడే మోహన్ బాబు మాటలని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే, వారికి ఆ అవకాశం ఇవ్వలేదు డైలాగ్ కింగ్. తాజాగా, అన్నగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఓ ట్విట్ చేశారు మోహన్ బాబు. ఈ ట్విట్ తో ఎన్టీఆర్ ఆడియో వేడుకలో ఆయన చేసిన కామెంట్స్ మరోసారి గుర్తు తెచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఇంతకీ మోహన్ బాబు చేసిన ట్విట్ ఏంటంటే.. ‘మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు’ అన్నారు.
మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు. pic.twitter.com/ojB6okJ2tb
— Mohan Babu M (@themohanbabu) December 24, 2018