పెళ్లి కంటే పార్టీలు చేసుకోవడమే ప్రభాస్’కు ఇష్టం !
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ ప్రభాస్ ల పెళ్లి న్యూస్ ఎప్పటికే హాట్ టాపిక్ నే. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనేది ఆయన కుటుంబ సభ్యులకి కూడా అర్థం కావడం లేదు. ఓ సందర్భంలో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెదనాన్న కృష్ణంరాజు సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఏమైనా.. చిన్న పిల్లాడా ? బలవంతగా పెళ్లి చేయడానికి. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని వాడినే అడగండి ? అన్నారు. ఇంతకీ ప్రభాస్ మనసులో ఏముంది ? ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు ??
ఈ ప్రశ్నకు దర్శకధీరుడు రాజమౌళి సమాధానం చెప్పారు. ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి ‘కరణ్ విత్ కాఫీ’లో పాల్గొన్నారు. ఆ ఏపీసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనే విషయంపై సరదాగా స్పందించారు.
ప్రభాస్ చాలా లేజి. పెళ్లి చూపులు, వెడ్డింగ్ కార్డులు పంచడం, పెళ్లి వేడుక ఇదంతా చాలా టైమ్ తీసుకుంటుంది. అదంతా ప్రభాస్ చేయలేడని జక్కన్న సరదాగా కామెంట్ చేశారు. ఐతే, హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ప్రభాస్ కు పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేయడానికి ఇష్టపడతారని రాజమౌళి తెలిపారు. సో.. పెళ్లి కంటే పార్టీలు చేసుకోవడం అంటేనే ప్రభాస్ కి ఇష్టమేమో.. !