బాడీ ఓకే.. బ్లాక్ బస్టర్ కావాలి !
హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే అఖిల్ అక్కినేని స్టార్. టాలీవుడ్ కి మరో ప్రిన్స్ రాబోతున్నాడు. మహేష్ అంతటి అందం అతడిది. దున్నేయబోతున్నాడు. కుమ్మేయబోతున్నాడు. అభిమానులు అఖిల్ తొలి సినిమా కోసం వెయిట్ చేయండి అనే రేంజ్ లో ప్రచారమ్ జరిగింది. ఐతే, తొలిసినిమా ‘అఖిల్’తో ఘోరంగా నిరాశపరిచాడు అఖిల్ అక్కినేని. ఇక, కసితో చేసిన రెండో సినిమా ‘హలో’ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ నుంచి మూడో సినిమాగా ‘మిస్టర్ మజ్ను’ వస్తోంది. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’తో సూపర్ హిట్ అందుకొన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దీంతో సహజంగానే ‘మిస్టర్ మజ్ను’పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టుగానే అఖిల్ బిల్డప్పులు కూడా ఉన్నాయి. ‘మిస్టర్ మజ్ను’ టీజర్ లోనే పాపల వెంట పడుతూ కనిపించాడు. అందులోనూ మహేష్ బాబు మేనరిజం ఫాలో అయ్యాడు. దీంతో ఈసారి అఖిల్ రొమాంటిక్ గా మారాడని అనుకొన్నారు. ఈలోగా ఇందులో మాస్ కూడా ఉందని సిక్స్ ప్యాక్ బాడీ చూపించేశాడు. ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ ని ఈ సాయంత్రం వదలబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ విడుదల చేసిన పోస్టర్ లో అఖిల్ సిక్స్ ప్యాక్ బ్యాడీతో ఆకట్టుకొన్నాడు. దీంతో ‘మిస్టర్ మజ్ను’ సాంగ్ విడుదల గురించి పక్కన పెట్టేసి అందరు అఖిల్ బాడీ గురించి మాట్లాడుకొంటున్నారు. బాడీ ఓకే.. ఈ సారైనా అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.
Worked really hard for this ! 3 months of hell and heaven I guess ! A big shout out to my trainer Dillip ! Couldn’t have done it without you! Totally worth it !!! #MrMajnu pic.twitter.com/us6nnVkJYl
— Akhil Akkineni (@AkhilAkkineni8) December 24, 2018