తమ్ముడు కోసం అన్నయ్య ప్రమోషన్
మెగా బ్రదర్స్ తమ్ముడి కష్టాన్ని ఇన్నాళ్లకి గుర్తించినట్టు కనబడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ’ స్థాపించినప్పుడు ఆయనకి మెగా ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్టు లభించలేదు. అసలు రాజకీయాల్లోకే వద్దు తమ్ముడు అని వారించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండం కూడా ఇందుకు ఓ కారణం. అన్నయ్య, తమ్ముడు.. ఇద్దరిలో నాగబాబు సపోర్టు ఎవరికి ? అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. నిర్మోహమాటంగా నాగబాబు అన్నయ్యకే జై కొట్టాడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చిరంజీవి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. దీంతో నాగబాబుకి సంక్షిష్టత లేదు.
ఈ నేపథ్యంలో నాగబాబు తమ్ముడు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. తనవంతుగా జనసేన పార్టీకి ఆర్థిక సాయం చేశారు. నాగాబు రూ. 25లక్షలు, ఆయన తనయుడు, హీరో వరుణ్ తేజ్ రూ. కోటి రూపాయలు జనసేనకి పార్టీ ఫండుగా ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే. అక్కడితే ఆగిపోలేదు నాగబాబు.. జనసేన పార్టీ గుర్తుని ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఓ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగబాబు.
త్వరలోనే నాగాబు మాదిరిగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పార్టీకి ఆర్థిక సాయం చేయబోతున్నట్టు సమాచారమ్. అది భారీ మొత్తంలో ఉందనుందట. మొత్తానికి.. ఇన్నాళ్లకి మెగా బ్రదర్స్ తమ్ముడు కష్టాన్ని గుర్తు చేశారు. రేపు ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరుపున ప్రచారానికి దిగిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో. అన్నదమ్ముల ఆసరాని తమ్ముడు పవన్ ఊరికే ఉంచుకోకపోవచ్చు. రేపు జనసేన అధికారంలోకి వస్తే.. గనుక అన్నయని గౌరవప్రదమైన గవర్నర్ పదవిని ఇప్పించే ప్రయత్నం, లేదంటే రాజ్యసభకి పంపవచ్చని చెప్పుకొంటున్నారు.