ఎంతో ఫన్.. వినేయండీ.. !

సంక్రాంత్రికి సందడి చేయబోతున్న సినిమాల్లో ‘ఎఫ్ 2’ ఒకటి. అనిల్ రావపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రమిది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నుంచి తాజాగా.. ‘ఎంతో ఫన్.. ఎంతోఫన్.. ‘ సాంగ్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. పాట కాస్త క్లాస్ టచ్ తో వినడానికి కాస్త కొత్తగా వుంది. వెంకీ తమన్నాలపై చిత్రీకరించే ఈపాటకు సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా బాగున్నాయి.

ఈ పాటతో సినిమాలో వెంకీ ఫన్ ని పంచనున్నాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్టేషన్ చూపిస్తాడన్న మాట. వీరిద్దరి ఫన్, ప్రస్టేషన్ ఏ రేంజ్ లో ఉన్నాయన్నది తెరపై చూడాలి. పండగ పూట ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇదే ఎఫ్ 2 సినిమాకి అతిపెద్ద ప్లస్ కానుంది. ఇక, సంక్రాంత్రి బరిలో నిలిచిన మూడు క్రేజీ సినిమాల్లో రెండు సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’, వరుణ్-వెంకీల మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ సినిమాలకి దేవినే సంగీతం.