మూడో టెస్టు : టీ-విరామానికి భారత్ 123/2
ఆసీస్తో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీవిరామ సయానికి రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. తొలి టెస్టులోనే అర్ధశతకం బాదిన మయాంక్ 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మరో ఓపెనర్ హనుమ విహారి 8 పరుగులు చేసి కుమ్మిన్స్ బౌలింగ్ లో ఫించ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ప్రస్తుతం క్రీజులో ఉన్న ఛెతేశ్వర్ పుజారా(33) నిలకడగా రాణిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లీ టీ-విరామం తర్వాత క్రీజులోకి రానున్నాడు.
ఇక, నాలుగు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టుని భారత్ గెలుచుకోగా, రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టు గెలిచి సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో భారమంతా కెప్టెన్ కోహ్లీపైనే పడనుంది. ఒత్తిడిలో అద్భుతంగా రాణించే కోహ్లీ ఏం చేస్తాడన్నది చూడాలి.