పేదింటి అమ్మాయి ప్రేమలో ప్రభాస్.. !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పేదింటి అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు సమాచారమ్. ఇంతకీ ఆ అమ్మాయి ప్రభాస్ కి ఎక్కడ పరిచయం అయ్యింది. వీరిద్దరు ఎలా ప్రేమలో పడ్దారు. ఆ పేదింటి అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చూసుకుంటారా.. ? అనేది తెలియాలంటే వేచి చూడాల్సింది. ఇదంతా రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రానికి సంబంధించినది.
1960 కాలంనాటి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు. వింటేజ్ కార్లంటే పడేచచ్చే వ్యక్తిగా కనిపిస్తాడట. ఇలాంటి రేంజ్ ఉన్న కుర్రాడు ఓ పేదింటి అమ్మాయి పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడట.
వీరి ప్రేమ ఆసక్తికరంగా ఉంటుందని సమాచారమ్. అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ రక్తికట్టించే కథనంతో ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్దా కపూర్ హీరోయిన్. వచ్చే యేడాది ఆగస్టు 15న సాహోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా షూటింగ్ తో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది.