వినయ విధేయ రాముడు ‘మగధీర’ని తలపిస్తున్నాడే.. !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ని వినయ విధేయ రాముడుగా చూపించబోతున్నాడు దర్శకుడు బోయపాటి. క్లాస్ రాముడ్ని మాస్ రాముడిగా ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. సంక్రాంత్రి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక రేపు (డిసెంబర్ 27) హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవితో పాటు తెరాస వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆడియో వేదికగా విడుదల చేయబోయే ట్రైలర్ ముహూర్తాన్ని తెలుపుతూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది.

ఇందులో చరణ్ గుర్రంపై రామ్ చరణ్ ఉన్న స్టిల్ మగధీరను గుర్తు చేస్తోంది. మగధీరలో గుర్రంపై గర్జిస్తున్న చరణ్ ని గుర్తు చేస్తోంది… ఈ పోస్టర్. పోజు సరే.. రిజల్ట్ కూడా మగధీర రిజల్ట్ రిపీట్ అయితే.. మెగా అభిమానులకి పండగే. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న వినయ విధేయ రామపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరీ.. ఆ అంచనాలని మించిపోయి మగధీర రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.