బాక్సింగ్ డే టెస్ట్ : భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్

బాక్సింగ్ టెస్టులో రెండో రోజు కూడా భారత ఆటగాళ్లు రాణించారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 443/7 వద్ద డిక్లెర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 215/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. 170 పరుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసిన కోహ్లీ (82), శ‌త‌క వీరుడు పుజారా (106) వెంట వెంట‌నే అవుట‌య్యారు.

ఆ తర్వాత బాధ్యతని రోహిత్ శర్మ తీసుకొన్నారు. రోహిత్ శర్మ 62 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రిషభ్ పంత్ 39పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగియడానికి మరో 6 ఓవర్లు ఉండగా భారత్ 443/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 8పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు హారీస్ 3, ఫించ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మూడో రోజు భారత బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనేదానిపై టెస్టు ఫలితం ఆధారపడి ఉండనుంది.