‘వివిఆర్’లో చరణ్ అత్త ఎవరో తెలుసా ?


రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన తొలి చిత్రమిది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం స్టార్ కాస్టింగ్ కనబడుతోంది. ఎవరు ఏ పాత్రలో కనిపించబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఐతే, సినిమాలో రామ్ చరణ్ అత్త పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అన్నది అప్పుడే తెలిసిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా సినిమాలో నటించిన నటీనటులని యాంకర్ సుమ సరదాగా పలకరించారు. నటి హేమని పలకరించగా.. ఈ సినిమాలో తాను రామ్ చరణ్ కి అత్తగా కనిపిస్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తగా నటించాలని ఆశపడ్డా. కానీ కుదరలేదు. ఇప్పుడు మాత్రం చరణ్ అత్తగా నటించా. చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పండగ వాతావరణంలో సాగిందని తెలిపింది. ఇక, సీనియర్ హీరోయిన్ స్నేహా సీనియర్ హీరో ప్రశాంత్ కి భార్య.. చరణ్ కి వదిన పాత్రలో కనిపించనుంది. మొత్తంగా వివిఆర్ లో హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది.