‘వివిఆర్’ ట్రైలర్.. రికార్డ్ వ్యూస్ !

వినయ విధేయ రాముడి రచ్చ మొదలైంది. గురువారం హైదరాబాద్ లో వివిఆర్ ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సినిమా ట్రైలర్ అదిరిపోయింది. బోయపాటి మార్క్ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ ని వదిలారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వివిఆర్ ట్రైలర్ హవా చూపిస్తోంది. విడుదల చేసిన గంటల్లోనే యూట్యూబ్ లో ట్రైలర్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొంది. మొత్తంగా ఇప్పటి వరకు 4మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకొంది. ట్రెడింగ్ లో టాప్ లో ఉంది.

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన తొలి చిత్రమిది. చరణ్ సరసన కైరా అద్వానీ నటించింది. టీజర్, ట్రైలర్ లోనూ విధ్వంసకరమైన రాముడు మాత్రమే కనిపించాడు. వినయ విధేయ రాముడి ఇప్పటి వరకు చూపించలేదు. బహుశా.. వినయ విధేయ రాముడిని సినిమాలో చూపిస్తారేమో. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్. డివివి దానయ్య నిర్మాత.