బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం
ఆసీస్తో బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 137 పరుగుల తేడాతో గెలుపొందింది. 258/8 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కొద్దిసేపటికే కమిన్స్ (63), లైయన్ (7) ఔటవ్వడంతో భారత్ విజయం ఖరారైంది. కమిన్స్ (63) నిన్నటి స్కోరుకి మరో రెండు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో వెనుదిరిగాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే ఇషాంత్.. లియాన్ని పెవీలియన్కి పంపాడు. దీంతో ఆసీస్ 261 పరుగులకి ఆలౌట్ అయింది. భారత్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-1కి చేరింది. టీమిండియా టెస్టు చరిత్రలో ఇది 150వ విజయం. మూడోటెస్టులో మొత్తం 9 వికెట్లు తీసిన బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 3న జరగనుంది.
స్కోరు వివరాలు :
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 443/7 డిక్లేర్డ్
రెండో ఇన్నింగ్స్: 106/8 డిక్లేర్డ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 151
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ : 261