సీఎం గెడ్డం తీశారు

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ గెడ్డం తీశారు. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసే వరకు తాను గెడ్డం తీయనని గతంలో సీఎం శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ సోమవారం ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. తన చిరకాల కోరిక నెరవేరడంతో తలనీలాలను సమర్పించానని తెలిపారు. కేంద్రప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంగతిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. సొంత జిల్లాలో పరిశ్రమ నిర్మించేందుకు కృషి చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.