నాని ‘జెర్సీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది !

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, రెబ్బా మోనికా జాన్‌ హీరోయిన్స్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ‍నిర్మిస్తోంది. ఏప్రిల్ 19వ ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

న్యూ ఇయర్ కానుకగా తాజాగా, ‘జెర్సీ’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నాని అర్జున్ పాత్రలో క్రికెటర్ గా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ లోనూ నాని మైదానంలోకి వెళ్లేందుకు రెడీగా షూస్ లేస్ కట్టుకొంటూ కనిపిస్తున్నాడు.అర్జున్‌ సాధించిన విజయాలను ఏప్రిల్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో నాని మూడు ఢిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.