బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఫిక్సయ్యింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. సినిమాని జనవరిలో ప్రారంభించబోతున్నట్టు నిర్మాతలు అల్లు అరవింద్, రాథాకృష్ణలు ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బన్నీ నటించనున్న 19వ చిత్రమిది. కాగా, త్రివిక్రమ్ – బన్నీల కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. గతంలో వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిని మించేలా బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ చిత్రం ఉండబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. జనవరిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం.. అదే నెలలో సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.