తండ్రైన రోహిత్ శర్మ

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తండ్రయ్యారు. ఆయన సతీమణి రితికా సజ్దే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో రితికా పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రితిక బంధువు సీమాఖాన్‌ (నిర్మాత సొహైల్‌ ఖాన్‌ భార్య) ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ తెలియగానే ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న రోహిత్ హుటాహుటిన భారత్ కి బయలు దేరారు.

2015 డిసెంబరు 13న రోహిత్‌ – రితికా వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌తో జరిపిన ఛాట్‌లో రోహిత్‌ తాను త్వరలో తండ్రవబోతున్న విషయాన్ని తొలిసారిగా వెల్లడించారు.