చూపుడువేలికి సిరా పోయింది.. !
సాధారణంగా ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలికి సిరా పెడుతుంటారు. ఐతే, తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికి సిరా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయించింది.ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా పెట్టారు. ఐతే, అది ఇంకా పూర్తిగా చెరగకపోవడంతో మధ్య వేలికి సిరా వేయాలని నిర్ణయిస్తూ ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక, మూడు విడతలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 7, 11, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల రిటర్నింగ్ అధికారులు ఇచ్చే నోటీసులతో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది.