హీరోయిన్’తో ఎఫైర్ పై దర్శకుడి స్పందన
కథని ఎంటర్ టైనింగ్ గా చెప్పడం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకత. ఆయన దర్శకత్వంలో వచ్చిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాల్లో కామెడీకి కొదవుండదు. అదే సమయంలో కథని గ్రిప్పింగ్ నడిపి ప్రశంసలు అందుకొన్నారు అనిల్. ఇలా కెరీర్ హాయిగా సాగిపోతున్న ఈ దర్శకుడుపై ఓ భయంకరమైన ప్రచారం జరుగుతోంది. ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నట్టు ఆ ప్రచార సారాంశం. సదరు హీరోయిన్ ని ఇతర దర్శకుల సినిమాల్లో తీసుకోవాలని రికమెండ్ కూడా చేస్తున్నారంట.
ఈ నేపథ్యంలో ‘ఎఫ్ 2’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి హీరోయిన్ తో ఎఫైర్ పై స్పందించారు. ‘నాకు ఏ హీరోయిన్ తోను ఎఫైర్ లేదు. నేనెవ్వరినీ రికమెండ్ చేసింది లేదు. నేను ఎలాంటివాడినన్నది నా కుటుంబసభ్యులకు, నా స్నేహితులకు తెలుసు. నేను తప్పు చేశాను అనిపిస్తే మా ఇంట్లో వాళ్లకి సమాధానం చెబుతాను. ఇంతవరకూ నాకు అలాంటి అవసరం రాలేదు’ అన్నారు అనిల్. పనిలేని వాళ్లు పుకార్లు పుట్టిస్తూనే ఉంటారని లైట్ గా తీసుకొన్నారు.
ఇక, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకీ-తమన్నా, వరుణ్ తేజు-మెహ్రీన్ లు జంటగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.