పొలిటికల్ ఎంట్రీపై గంభీర్ ప్రకటన


టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ప్రచారంపై గంభీర్ స్పందించారు. ‘తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదు. ఆ ఊహాజనిత వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పడేశాడు. ప్రస్తుతానికి తాను రిటైర్డ్ క్రికెటర్‌ను మాత్రమే’నని పేర్కొన్నాడు. ఇక, ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు టెస్ట్ సిరీస్ గెలుపు కోసం అందరిలా తాను కూడా వేచి చూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు గంభీర్.

టీమిండియా విజయాల్లో గంభీర్ కీలక భూమిక పోషించారు. టీమిండియా గెలిచిన టీ20, వన్ డే ప్రపంచకప్ లో గంభీర్ సభ్యుడు. అంతేకాదు.. ప్రపంచకప్ ఫైనల్స్ లో గంభీర్ నే టాప్ స్కోరర్. టీ20, వన్ డే, టెస్టు అన్ని ఫార్మెట్స్ లో రాణించాడు. టెస్టుల్లో టీమిండియా నెం. 1 స్థానంలో నిలవడంలో గంభీర్ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు.