రామ్ ‘ఇస్మాట్ శంకర్’ అయ్యాడు బై.. !


పూరి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ ని పెట్టారు. చేతిలో సిగరేట్.. ఊరమాస్ లుక్ లో ఉన్న రామ్ లుక్ ని అది కూడా రివర్స్ లో చూపించారు. తలపై డబుల్ సిమ్ కార్డ్ అని పేర్కొన్నారు.

దీన్నిబట్టి చూస్తే.. ఇందులో రామ్ రెండు మెంటాలిటీస్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నట్టు కనబడుతోంది. హైదరాబాదీ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మొత్తంగా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలని పెంచేశాడు పూరి. ఇది కూడా ఓ పోకిరి.. టైపు కథాంశంగా తెరకెక్కనున్నట్టు కనబడుతోంది. అది నిజమైతే ఓ సూపర్ ట్విస్టు ఉండబోతుంది అన్నమాట.

ఇక, ఇస్మార్ట్ శంకర్ కోసం పూరి ఓ కొత్త హీరోయిన్ సెలక్ట్ చేశాడని తెలిసింది. ఆమె కూడా తెలుగమ్మాయి.. హైదారాబాదీ అమ్మాయని చెబుతున్నారు. ఈ సినిమాని పూరి, ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు