సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా కలియతిరిగారు కేటీఆర్. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పార్టీలో ఆయన బాధ్యత మరింత పెరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఐతే, అంతకంటే ముందు పంచాయతీ ఎన్నికలపై దృష్టిపెట్టారు కేటీఆర్. ఇందులో భాగంగా మరోసారి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి సిరిసిల్లకు వెళ్లనున్నారు. సిరిసిల్లలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్‌హాల్‌లో మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేయనున్నారు.

ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట, 1.30 గంటలకు గంభీరావుపేట, 2.30 గంటలకు ముస్తాబాద్, 3.30 గంటలకు తంగళ్లపల్లి.. సాయంత్రం 4.30 సిరిసిల్ల టౌన్ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.