రోహిత్ శర్మ బుజ్జిపాపని చూశారా.. ?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ ఫాదర్ గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఆయన భార్య రితికా డిసెంబర్ 30న పండింటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న రోహిత్ కూతురుని చూసేందుకు హుటాహుఠిన ఇండియాకు బయలుదేరి వచ్చేశారు. ప్రస్తుతం ముద్దుల కూతురుని దగ్గరుండి చూసుకొంటున్నారు.

ఈ ఆనందంలో తన కూతురి తొలి ఫోటోని అభిమానులతో పంచుకొన్నారు రోహిత్. తన వేలిని, తన భార్య రితికా వేలిని పట్టుకున్న చిన్నారి ఫోటోని తన ట్విట్ చేశారు రోహిత్. దానికి ‘హలో వరల్డ్.. 2019 అందిరికి చాలా అద్భుతంగా గడవాలి’ అనే కామెంట్ పెట్టారు. ఈ ఫోటోలో చిన్నారి పూరి ఫేస్ కనబడటం లేదు. దీంతో ఇది రోహిట్ బుజ్జిపాప ప్రీ లుక్ మాత్రమే ఫస్ట్ లుక్ త్వరలో.. ! అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక, కూతురు పుట్టడంతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌కి రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే. నాల్గో టెస్టులో రోహిత్ స్థానంలో హనుమ విహారిని తీసుకొన్నారు. జనవరి 8న రోహిత్ తిరిగి జట్టుతో కలవనున్నాడు. జనవరి 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడబోతున్నాడు. మరీ.. కూతురు పుట్టిన ఆనందంలో రోహిత్ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడన్నది చూడాలి.