సిడ్నీ టెస్టు : కోహ్లీ అవుట్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ జట్టు 180 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 23 పరుగులు చేసి హజ్లె వుడ్ బౌలింగ్ లో కోహ్లీ పైనేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 213/3 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. క్రీజులో పూజారా 81, రహానే 13 ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి వికెట్ త్వరగానే కోల్పోయింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 9 పరుగుకే అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పుజారా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. 34వ ఓవర్లో లైయన్ వేసిన బంతిని స్టార్క్ చేతికిచ్చి మయాంక్(77) పెవిలియన్ చేరాడు. 123పరుగుల వద్ద టీమిండియా మయాంక్ వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత 180 పరుగుల వద్ద మూడో వికెట్ గా కోహ్లీ (23) అవుటయ్యారు.