బ్రేకింగ్ : ‘ఎన్ఐఏ’కు జగన్ కత్తి కేసు

జగన్ కత్తి కేసుని ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం ఈ కేసుని ఎన్ఐఏ కి బదిలీ చేయాలని గతంలోనే పిటిషన్ దాఖలైంది. కేసు దర్యాప్తు ఆలస్యం అయితే.. సాక్ష్యాలు తారుమారు అవుతాయని జగన్ తరుపు పిటిషనర్ వాదించారు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభస్తూ.. కేసుని ఎన్ఐఏకి అప్పగించింది.

అక్టోబర్ 25న విశాఖ ఏయిర్ పోర్టులో జగన్ పై కత్తిదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుని ఎన్ఐఏ కి అప్పగించాలని మొదటి నుంచి వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఏపీ పోలీసులు కేసుని తప్పుదారి పట్టించే అవకాశం ఉందని.. అందుకే కేసుని ఎన్ఐఏ బదిలీ చేయాలని కోరారు. ఇప్పుడీ ఈ కేసుని ఏపీ హైకోర్టుకి ఎన్ఐఏ బదిలీ చేయడంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.