క్లీన్ ‘యూ’ కథానాయకుడు


ఎన్టీఆర్ జీవితకథని దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సంక్రాంత్రి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ని పొందింది. సింగిల్ కట్ కూడా లేకుండా కథానాయకుడు క్లీన్ యూ సర్టిఫికెట్ ని పొందడం విశేషం.

ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నారు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, మహానటి సావిత్రిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, హన్సిక, భరత్.. తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. వారాహి, ఎన్‌బీకె ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఎన్ టీఆర్ బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్-మహానాయకుడు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.