ఎంపీ, ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడి
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంతో కేరళలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం మాత్రం తాము సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కేరళలో రాష్ట్రపతి పాలనని విధించాలనే డిమాండ్ కూడా వినబడుతోంది.
శుక్రవారం రాత్రి కేరళలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కన్నూర్ లో నాటు బాంబుల దాడి జరిగింది. బీజేపీ ఎంపీ వీ. మురళీధరన్, సీపీఎం ఎమ్మెల్యే ఎఎన్. షమ్మీర్ ఇళ్లపై దుండగులు బాంబు దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. 20మందిని అదుపులోనికి తీసుకొన్నారు. ఐతే, కేరళలో ఎప్పుడు ఏ పరిస్థితులకి దారితీస్తాయన్నది అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.