ఎంపీగా కేసీఆర్.. ఏ స్థానం నుంచి ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తనయుడు కేటీఆర్ కి ప్రమోషన్ ఇచ్చారు. కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అంతేకాదు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోగా తనయుడిని తన స్థానంలోకి తీసుకురానున్నారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత కేటీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టిస్తారిస్తారని చెప్పుకొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెబుతున్నారు.
కేటీఆర్ ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే దానిపై కూడా చర్చసాగుతోంది. ఆయన మహబూబ్ నగర్ లేదా సిద్దిపేట జిల్లా నుంచి ఎంపీగా బరిలోకి దిగవచ్చని చెప్పుకొంటున్నారు. ఆయనతో పాటు అల్లుడు హరీష్ రావుని కూడా ఎంపీగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. హరీష్ ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారనే విషయంపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే అల్లుడు హరీష్ ని ఇప్పటివరకు తన కేబినెట్ లోకి తీసుకోలేదని కూడా చెప్పుకొంటున్నారు. మరీ.. ఇందులో నిజమెంత ? అనేది తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.