నయీమ్ బినామీ ఆస్తులు రూ.1200కోట్ల స్వాధీనం ఎప్పుడంటే ?
గ్యాగ్ స్టర్ నయీమ్ బినామీ ఆస్తుల స్వాధీనానికి ప్రక్రియ మొదలైంది. 2016 ఆగస్టు 9న షాద్ నగర్ లో నయీమ్ ని ఎంకౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నయూమ్ చనిపోయిన తర్వాత అతని పాపల చిట్టా బయటికొచ్చింది. బాధితులు బయటికి రావడంతో 293 కేసులు నమోదయ్యాయి. నయీమ్ కేసుని దర్యాపు సిట్ ని ఏర్పాటు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నయీమ్ ఇప్పటివరకు 1000 ఎకరాల బూమి 1.67లక్షల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు. 27 ఇళ్లు అక్రమంగా కూడగట్టినట్టు గుర్తించారు.
నయీమ్ ఎవరెవరి స్థలాలు కబ్జా చేశారన్నది సిట్ అధికారులు గుర్తించారు. నయీమ్ తో పాటు ఆయన బంధువుల్లో జరిగిన సోదాల్లో ఇందుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకొన్నారు. వాటిలోని సర్వే నెంబర్ల ఆదారంగా ఈ కబ్జాలని గుర్తించారు. ఈ నేపథ్యంలో నయీమ్ బినామీ ఆస్తులని ప్రాపర్టీస్ ప్రొబిషినరీ యూనిట్ కింద స్వాధీనం చేసుకొనేందుకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు రాగానే విచారణ మొదలు కానుంది. ఆ తర్వాత నయీమ్ బినామీ ఆస్తులని ఎటాక్ చేయనున్నారు.