వైరల్ : సితార నోట బ్రదర్ పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్. సినిమా షూటింగ్ లేదంటే ఇంట్లోనే గడిపేస్తుంటాడు మహేష్. వీలు చిక్కినప్పడుల్లా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్స్ వేస్తుంటాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మహేష్ ఫ్యామిలీ ఫారిన్ వెళ్లొచ్చారు. చివరగా దుబాయ్ మీదుగా హైదరాబాద్ తిరిగొచ్చారు. ఐతే, మహేష్ మాదిరిగా ఆయన తనయుడు ఫ్యామిలీ పర్సన్ నే అట. ఈ విషయాన్ని మహేష్ ముద్దుల కూతురు సితార పాట రూపంలో చెప్పింది. దానికి సంబంధించిన వీడియోని మహేష్ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియా సోషల్ మీడియా వైరల్ గా మారింది.