జగన్ కు అన్నీ గుడ్ న్యూసులే !

వైసీపీ అధినేత జగన్ శుక్రవారం రెండు గుడ్ న్యూసులు విన్నారు. ఆయనపై జరిగిన కత్తిదాడి కేసుని ఏపీ హైకోర్టు ఎఎన్ఐ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, జగన్ అక్రమాస్తుల కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుని మళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టే అవకాశం ఉందనే న్యూస్ బయటికొచ్చింది.

ఉమ్మడి హైకోర్టు విడిపోవడంతో నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త న్యాయమూర్తిని ఇంకా నియమించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరు న్యాయమూర్తిగా నియమితులైనా, జగన్ అక్రమాస్తుల కేసులో తిరిగి మొదటి నుంచి వాదనలను వినాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో 11 ఛార్జ్ షీట్లు నమోదు కాగా, రెండింటిపై విచారణ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి విచారణ అంటే.. కేసుని నీరు గార్చడమేనని టీడీపీ వాదిస్తోంది.

ఇక, టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వైసీపీలో చేరబోతున్నారు. దీనిపై కూడా శుక్రవారమే అలీ స్పందించారు. ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్బంలో ఇచ్చాపురంలో వైసీపీ నిర్వహించబోయే బహరంగ సభ వేదికగా అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మొత్తంగా శుక్రవారం జగన్ కి అన్నీ గుడ్ న్యూస్ లే విన్నారని చెప్పవచ్చు.