ఎన్టీఆర్’తో పోటీపై చరణ్ కామెంట్

ఎన్టీఆర్ తో పోటిపడటంపై రామ్ చరణ్ స్పందించారు. ఈ సంక్రాంత్రికి ‘ఎన్టీఆర్-కథానాయకుడు’తో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమా పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు ఎఫ్ 2, పేటా సినిమాలు పోటిలో ఉన్నాయి. ఈ తీవ్రమైన పోటీపై చరణ్ ఆసక్తిగా స్పందించారు.

సంక్రాంత్రికి రాబోతున్న నాలుగు సినిమాలు హిట్ కావాలని చరణ్ ఆకాంక్షించారు. ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ఎంతో గౌరవనీయమైన చిత్రం. ఎన్టీఆర్ పై ఎంతో గౌరవంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తాను కూడా ఎన్టీఆర్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా. మిగిలిన సినిమాలు ఎఫ్ 2, పేటా కూడా మంచి విజయాన్ని అందుకోవాలి అన్నారు చరణ్.

సంక్రాంత్రి సినిమాల్లో జనవరి 9న ఎన్టీఆర్-కథానాయకుడు, జనవరి 10న పేటా, జనవరి 11న వినయ విధేయ రామ, జనవరి 12న ఎఫ్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.