కెప్టెన్’గా కోహ్లీ రికార్డు
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. అక్కడ తొలిసారి టెస్టు సిరీస్ ని గెలుచుకొంది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లలో తొలి టెస్టు సిరీస్ ను భారత్ కైవసం చేసుకోవడం విశేషం. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ సిరీస్ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్కు 7 విజయాలు దక్కాయి.
ఇక, కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు కెప్టెన్ గా విదేశాల్లో అధిక టెస్టు సిరీస్ గెలిచిన రికార్డు గంగూలీ పేరిట ఉంది. గంగూలీ సారధ్యంలోని భారత జట్టు విదేశాల్లో 11 టెస్టు సిరీస్ లని గెలిచింది. ఇప్పుడీ ఆసీస్ లో టెస్టు సిరీస్ తో గంగూలీ రికార్డుని కోహ్లీ సమం చేశారు.