‘ఎన్టీఆర్-కథానాయకుడు’ పబ్లిక్ టాక్


ఎన్టీఆర్-కథానాయకుడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. ఎన్టీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలని ఆయన బయోపిక్ లో చూపించబోతున్నామని చిత్రబృందం చెప్పడంతో.. అవేంటో తెలుసుకొనేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఎన్ టీఆర్ కథానాయకుడు థియేటర్స్ వైపు పరుగులు తీస్తున్నారు. మరీ.. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ ఏంటీ.. ? ఓ లుక్కేద్దాం పదండీ.. !

ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుందని చిత్రబృందం ముందు నుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే.. 1984లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ షాట్ తో చిత్రం ప్రారంభం అయ్యింది. రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగిగా ఎన్టీఆర్ పరిచయం కాబడ్డారు. ఎన్టీఆర్ తన ఉద్యోగాన్ని వదిలేసి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్న సన్నివేశాలు, ఆరంభంలో సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న సమస్యలుకు సంబందించిన సన్నివేశాలు భావోద్వేగ పూరితంగా సాగాయి.

‘మాయాబజార్’ చిత్రంలో కృష్ణుని పాత్రలో, ‘సీతా రామ కళ్యాణం’ చిత్రంలో పది తలల రావణుని పాత్రలో ఎన్టీఆర్
అభిమానులని అలరించాయి. ఎన్టీఆర్ మొదటి కొడుకు రామ కృష్ణ చనిపోయిన సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా భావోద్వేగ పూరిత సన్నివేశంతో ఫస్టాఫ్ పూర్తయ్యింది. ఇక సెకాంఢాఫ్ లో నర్తనశాల, దానవీర శూర కర్ణ, యమగోల చిత్ర హీరోయిన్ జయప్రద పాత్రలో హన్సిక, వేటగాడు, సర్దార్ పాపారాయుడు సినిమాల్లోని పాటల్లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించి అలరించారు. క్లైమాక్స్’లో పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఎన్టీఆర్ తన రాజకీయ పార్టీ తెలుగుదేశం సినిమాని ప్రకటించడంతో సినిమా పూర్తయ్యింది.