వినయ విధేయ రాముడు ట్రెడింగ్’లో టాప్ !

సంక్రాంత్రి సినిమా ‘వినయ విధేయ రామ’ హవా మాములుగా లేదు. ఎక్కడ చూసిన ‘వివిఆర్’ పోస్టర్లే. సోషల్ మీడియాలోనూ ‘వివిఆర్’ ముచ్చట్లే. ట్రెడింగ్ లోనూ టాప్ లో ఉన్నాడు వినయ విధేయ రాముడు. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇక, సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వివిఆర్’పై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో యాక్షన్ హైలైట్ గా ఉంది. రామ్ చరణ్ వన్ మేన్ షో చేశాడు. ఫైట్స్, డ్యాన్సులు, డైలాగ్స్ లో చరణ్ ఇరగదీశాడని చెప్పుకొంటున్నారు. ఈ టాక్ ని విని మెగా అభిమానులు ఏమాత్రం కంగారు పడటం లేదు. ఎందుకంటే.. ? హై వోల్టేజ్ సినిమాలకి ఇలాంటి టాక్ సహజమే. అయినా.. కమర్షియల్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.