ఆఖరి వన్డేలో భారత్ గెలుపు.. సిరీస్ కైవసం !
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా 7వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు హ్యాండ్స్ కోంబ్ 58, షను మార్ష్ 39, ఖవాజా 34, గ్లెన్ మాక్స్ వెల్ 26 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు చాహల్ 6 వికెట్లు, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లు రెండు చొప్పున వికెట్లు తీశారు.
231 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోనీ 87, కేదార్ జాదవ్ 61, విరాట్ కోహ్లీ 46, శిఖర్ ధావన్ 23 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు రిచర్డ్ సన్, షడ్డీల్, స్టోయినిస్ ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. టీమిండియా విజయంతో కీలక పాత్ర పోషించిన ధోని (87 నాటౌట్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.