ఎఫ్2 ఎఫెక్ట్ : పెళ్లి వాయిదా వేసుకొన్న తమన్నా


మిల్కీబ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం తమ్మూకి సరైన పెళ్లి కొడుకుని వెతికే పనిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారంటూ వార్తలొచ్చాయ్. అవి నిజమే అన్నట్టు.. తమ్మూ కూడా సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యేడాది తమ్మూ ఓ ఇల్లాలు కానుందని అందరు భావించారు. ఇప్పుడు తమ్మూ యుటర్న్ తీసుకొంది. పెళ్లి ఆలోచనని విరమించుకొన్నట్టు టాక్.

దీనికి ఓ కారణం ఉంది. ఈమధ్య తమ్మూకి సరైన హిట్ లేదు. ఒక్క హిట్ పడితే మళ్లీ స్వింగులోకి వస్తాననే ఆలోచనతో తమ్మూ ఉంది. ఆ హిట్ దక్కకపోవడంతో ఆమె మనసు పెళ్లివైపు మళ్లీంది. ఐతే, ‘ఎఫ్ 2’ రూపంలో తమ్మూ ఖాతాలో ఓ బంపర్ హిట్ పడింది. దీంతో ఆమెకి కెరీర్ పై మళ్లీ ఆశలు చిరుగిరించినట్టున్నాయ్. సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయిపోవాలని ఆశపడుతోంది. తాను సీనియర్ హీరోయిన్స్ కి మంచి ఆప్షన్ గా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి ఆలోచనని వాయిదా వేసుకొన్నట్టు సమాచారమ్.

తమ్మూ భావించినట్టుగానే ఎఫ్ 2 తర్వాత సీనియర్ హీరోల పక్కన తమ్మూ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ సైరా లో కీలక పాత్రల్లో నటిస్తోంది. తమిళ్ లోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇక, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ సినిమా కోసం తమ్మూ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాజల్ తరహా.. సీనియర్ హీరోలతో రౌండ్ వేసొచ్చాకా.. యంగ్ హీరోలని తగులుకొద్దామని ప్లాన్ చేసుకొందని సమాచారమ్.