‘వెంకీ మామ’కు రానా స్పెషల్

విక్టరీ వెంకటేష్ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తున్నాడు. వరుణ్ తేజ్ తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఎఫ్ 2’. సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తోడళ్లులు (వెంకీ, వరుణ్) పండగ పూట ప్రేక్షకులని బాగానే నవ్వించేశారు. ఆ నవ్వులు ఇంకా ఆగలేదు. అవి ఇప్పటికే రూ.100 కోట్లు తెచ్చిపెట్టాయి. ఇంకా వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ ఆనందంలో వెంకీ తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాలో నటించబోతున్నాడు.

ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసిందే. ఈ మల్టీస్టారర్ లో దగ్గుపాటి యంగ్ హీరో రానా దగ్గుపాటి అతిధి పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి ‘వెంకీమామ’ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే యేడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చైతూ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, వెంకీ జంటగా హుమా ఖురేషి జతకట్టబోతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ – కోన ఫిలిం కార్పొరేష‌న్ – పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.