త్రివిక్రమ్ కథ చెప్పేశాడు

త్రివిక్రమ్-బన్నీల కలయికలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మార్చి నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇటీవలే త్రివిక్రమ్ బన్నీని కలిసి కథని కూడా చెప్పాడట. అయితే తొలిసగం మాత్రమే నెరేషన్ ఇచ్చారా ? ఫుల్ నెరేషన్ ఇచ్చారా ? అన్నది తెలియాల్సి వుంది. త్రివిక్రమ్ నెరేషన్ ఏ అబ్జెక్షన్స్ లేకుండా ఓకె అయినట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో కదలిక వచ్చినట్టయింది.

స్కిప్ట్ ఫైనల్ కావడంతో నటీనటుల ఎంపికపై దృష్టి పోకస్ చేయనున్నారు. హీరోయిన్ గా వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్, రష్మిక మందన, కైరా అద్వానీల పేర్లు వినిపిస్తున్నారు. వీరిలో త్రివిక్రమ్ ఎవరిని ఫైనల్ చేస్తారన్నది చూడాలి. ఇక, సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్, థమన్ లలో త్రివిక్రమ్ ఎవరిని తీసుకొంటాడన్నది ఆసక్తిగా మారింది. త్రివిక్రమ్-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో మాంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దేవిశ్రీ బన్నీకి మంచి స్నేహితుడు కూడా. ఈ నేపథ్యంలో దేవిని కాదని థమన్ తీసుకొనే సాహాసం త్రివిక్రమ్ చేస్తాడా ? అన్నది చూడాలి.