బడ్జెట్ కాదు.. ఎన్నికల అస్త్రం !
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ఆకర్షించే హామీలని ఇచ్చే ప్రయత్నంలో జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు జనాకార్షక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాం. మినిమమ్ ఇన్ కమ్ గ్యారెంటీ పథకాన్ని అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ హామీలకి కౌంటర్ ప్రధాని నరేంద్ర మోడీ హామీలు ఇవ్వబోతున్నాడనే ప్రచారం జరిగింది. వాటిని మధ్యంతర బడ్జెట్ లో పొందుపరిచినట్టు స్పష్టమవుతోంది. ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో మధ్యతరగతిపై భారీ వరాలు కురిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మధ్యంతర బడ్జెట్ ని ఎన్నికల అస్త్రంగా వినియోగించుకొన్నారు.
మధ్యంతర బడ్జెట్ లోని ముఖ్యాంశాలు :
* కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏడాది రూ.6వేలు
* గోకుల్ మిషన్ కోసం రూ.750కోట్లు కేటాయింపు
* గ్రాట్యూటీ పరిమితిని రూ.30లక్షలకు పెంపు
* పెన్షన్లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు
* కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు
* 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్
* నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్.
* రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయింపు
* రైల్వేకు రూ.64,500 కోట్లు కేటాయింపు
* భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్ విండో విధానం
* కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై తర్వలో నిర్ణయం
* వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.
* రూ.6.5లక్షల వరకూ ఉన్న వారికి బీమా, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ
* స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంపు
* పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు
* టీడీఎస్ పరిమితి రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంపు