వృద్దులకి రూ.3 వేలు పెన్షన్

ఊహించినట్టుగానే మోడీ ప్రభుత్వం జనాకార్షక బడ్జెట్ ని తీసుకొచ్చింది. ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నంగా పలు రాయితీలు, పథకాలతో మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను రూపొందించింది. ఈ బడ్జెట్‌ను శుక్రవారం తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రైతులు, వృద్దులు, కార్మికులు.. ఆకట్టుకొనేలా కేంద్రం మధ్యంతర బడ్జెట్ ని తీసుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది బీజేపీ ఎన్నికల అస్త్రం.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏడాది రూ.6 వేలు అందించబోతున్న కేంద్రం.. వృద్దులని ఖుషి చేసింది. దేశంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ రూ.3 వేలు పెన్షన్ అందిస్తామని పియూష్ గోయెల్ ప్రకటించారు. ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేర దేశంలో అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ అందిస్తామన్నారు.రూ.60 ఏళ్లు నిండిన అందరికీ నెలనెలా పింఛన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.