బ్రేకింగ్ : తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత

నందమూరి హీరో తారకరత్నకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని తారకరత్నకు చెందిన ‘డ్రైవ్ ఇన్ రెస్టారెంట్’ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో రెస్టారెంట్‌ నడుపుతున్నారు. రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తనకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను తారకరత్న రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆయనకి జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల పాటు సమయం ఇచ్చారు. ఈ లోపుగా రెస్టారెంట్ సామాగ్రిని తరలించే పనిలో సిబ్బంది పడ్డారు.

ఐతే, ఈ కూల్చివేత వెనక ఏదైన రాజకీయం కోణం ఉందా.. ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కంటే.. ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తారకరత్న టీడీపీ తరుపున గ్రేటర్ లో ప్రచారం చేశారు. టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థి నందమూరి సుహాసిని కోసం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. దాని ఫలితమే తాజాగా తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత అనే డౌటు కలుగుతున్నాయి. దీనిపై పొలిటికల్ కామెంట్ ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది.