రాకేష్ రెడ్డి గత చరిత్ర ఎంతో నీచం.. !

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ జయరామ్ ని తానే చంపానని పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నట్టు సమాచారమ్. హార్ట్ పేషెంట్ అయిన జయరాంని తాను గట్టిగా ఒక్క దెబ్బ కొట్టేసరికి చనిపోయాడని తెలిపారు. మరోవైపు, రాకేష్ రెడ్డి నేర చరిత్రను పోలీసులు తవ్వుతున్నారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. రాకేష్ రెడ్డి అనేక మోసాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడేవాడని పోలీసులు గుర్తించారు.

గతంలో హైద్రాబాద్‌‌లోని ఓ స్టార్ హోటల్‌లో ప్రముఖ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో కూడ రాకేష్ రెడ్డి అరెస్టైనట్టుగా పోలీసులు గుర్తు చేస్తున్నారు. సినీ హీరోయిన్లతో పాటు సినీ ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులతో కూడ రాకేష్ రెడ్డి వ్యభిచారం నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ ఎమ్మెల్యే పేరుతో రాకేష్ రెడ్డి సుమారు రూ.80 లక్షలను వసూలు చేశారని తెలిసింది. మొత్తంగా రాకేష్ రెడ్డి గత చరిత్ర ఎంతో నీచమైందని పోలీసులు గుర్తించారు.