ఏపీ పోలీసులపై నమ్మకం లేదు

పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ జయరాం హత్యకేసు మరో మలుపు తిరిగింది. జయరాం హత్యకేసులో నిందితులుగా రాకేష్ రెడ్డి, అతడి డ్రైవర్ శ్రీనివాసులుగా ఏపీ పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని మంగళవారం మీడియా ముందు హాజరుపరిచారు కూడా. ఈ సందర్భంగా హత్యకేసుకు సంబంధించిన పూర్తి వివరాలని కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాకు వివరించారు.

ఇది జరిగిన కొన్ని గంటల్లోనే జయరాం భార్య పద్మశ్రీ హైదరాబాద్ లో జూబ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. శిఖా చౌదరిపై ఫిర్యాదు చేసింది. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదు. ఈ కేసులో తనకు పలు అనుమానాలున్నాయి. శిఖా చౌదరి ప్రమేయం లేకుండా రాకేష్ రెడ్డి ఏం చేయలేడు. జయరాం చనిపోయిన వెంటనే.. శిఖా చౌదరి తన ఇంటికి వెళ్లడం వెనక తనకు పలు అనుమానాలున్నాయని పద్మశ్రీ తెలిపింది. హైదరాబాద్ లో హత్య జరిగింది. కావున ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేయాలని కోరింది.