బోయపాటిని ఇబ్బంది పెడుతున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బోయపాటి శ్రీనుని కావాలనే ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. సంక్రాంత్రికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులని ఆకట్టుకోకపోయింది. అంతేకాదు.. చరణ్ తో బోయపాటి చేయించిన ఓవర్ యాక్షన్ ని చూసి ప్రేక్షకులు నవ్వుకొన్నారు. ఇంత దారుణంగా సినిమా తీయడంపై చరణ్ అభిమానులు బోయపాటిపై ఆగ్రహం వ్యకం చేశారు.

ఇదిలావుండగా.. తాజాగా, ‘వివిఆర్’ విషయంలో అభిమానులకి క్షమాపణలు చెబుతూ ఓ లేఖని విడుదల చేశారు రామ్ చరణ్. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృత‌జ్ఞుడనై ఉంటా’.నని లేఖలో పేర్కొన్నారు చరణ్. ఐతే, దర్శకుడు బోయపాటి పేరుని మాత్రం ప్రస్తావించలేదు.

ఈ నేపథ్యంలో చరణ్ కావాలనే బోయపాటిని టార్గెట్ చేసినట్టు కనబడుతోంది. ‘వివిఆర్’ షూటింగ్ టైంలో బోయపాటి ఎవ్వరి మాట వినలేదట. బోయపాటికి నిర్మాత దానయ్యతో అంతగా పొసగలేదట. కొన్ని విషయాల్లో చరణ్ మాట వినలేదట బోయపాటి. యాక్షన్ సీన్స్ మరీ ఓవర్ గా ఉన్నాయని చెప్పినా.. అవే కాసులు కురిపిస్తాయని చెప్పుకొంటూ వచ్చాడట. అదంతా మనసులో పెట్టుకొనే చరణ్ ఇప్పుడు లేఖ రూపంలో బోయపాటిని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థమవుతోంది.