నటి ఝాన్సీ ఆత్మహత్య వెనక షాకింగ్ నిజాలు


బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య వెనక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారమ్. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని, సూర్య అలియాస్ నాని అనే యువకుడు మోసం చేసినట్టు ఆమె తండ్రి వెల్లడించాడు. ఆత్మహత్యకు ముందు సూర్యతో వాట్సాప్‌లో ఝాన్సీ చాటింగ్ చేసింది. వారిద్దరూ కలుసుకున్నారు కూడా. ఆ తర్వాతే ఝాన్సీ ఇంటికొచ్చి ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారమ్.

ప్రస్తుతం పోలీసులు సూర్యని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఝాన్సీ సూర్యతో సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, సీరియల్‌ అవకాశాలు కోల్పోయి, మరోవైపు సూర్య మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. కుటుంబం వైపు నుంచి కూడా ఝాన్సీ ప్రేమ పట్ల వ్యతిరేకత వ్యక్తం అయినట్టు అర్థమవుతోంది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.